Wednesday, June 25, 2014

Miracle - A Story by Manto

మహాత్మ్యం – సాదత్ హసన్ మంటో


లూటీ చేసిన సొత్తును తిరిగి పట్టుకునే ఉద్దేశ్యంతో పోలీసులు దాడులు మొదలు పెట్టారు.
ప్రజలు భయపడి దొంగసొమ్మును రాత్రి చీకటిమాటున బయట పడేయను మొదలు పెట్టారు. కొంతమంది సందర్భం చూచుకుని తమ వస్తువులను కూడా దూరం చేసుకున్నారు. చట్టం పట్టునుంచి దూరంగా డాలన్నది ఒక్కటే ఆలోచన.
ఒకతనికి చాలా కష్టం ఎదురయ్యింది. అతని దగ్గర పచారీ దుకాణంనుంచి దొంగిలించిన చక్కెర సంచులు రెండు ఉన్నయి. ఒకదాన్ని ఏదో ఒక రకంగ దగ్గరలోని బావిలోకి చీకటిపూటన పడవేశాడు. కానీ, రెండవదాన్ని కూడా బావిలో వేయబోతూ దాంతో తానూ పడిపోయాడు.
చప్పుడు విని జనం గుమిగూడారు. బాయిలోనికి తాళ్లు దించారు. యువకులు లోపలికి దిగారు. మనిషిని వెలికి తెచ్చారు. కానీ, నాలుగు గంటల తరువాత అతను చనిపోయాడు.
మరుసటి నాడు ప్రజలు మామూలుగానే బాయినుంచి నీళ్లు చేదుకున్నారు. తాగితే నీళ్లు తియ్యగా ఉన్నాయి.


ఆ రాత్రి ఆ మనిషి సమాధి మీద దీపాలు వెలుగుతున్నాయి.
(Thanks to net sources for the material)

Saturday, June 21, 2014

WIFI - A Cartoon

No explanation needed!