Sunday, April 24, 2011

Why We Write!

ఎందుకు రాస్తము?

పరిశీలించినము గనుక
ఆలోచించినము గనుక
కలలున్నయి గనుక
ఏదో కావాలనుకున్నము గనుక

దిసమొలతోటి తోటలో తిరుగుకుంటు
అప్పుడే కండ్లు దెరిచి ఉదయాన్ని చూస్తుంటే
ఎవరో చెవిలో రహస్యం చెప్పినరు గనుక

దారిలో నడుస్తుంటే
కారులోని పిల్లగాడు
మొహం అద్దానికి ఒత్తి
ముక్కు పందిముక్కలాగ కనబడుతుండంగ
నన్ను జూచి తొర్రి పండ్లలోనుంచి ఇకిలించినందుకు

ప్రేమ ఒదిలి పారిపోయి
మళ్లెప్పుడో నన్ను
ఎడలేని ఎండలో
వడగాలి తాగుతుండగా
మళ్ల కలిసినందుకు

ఎవరో నన్ను చూస్తున్నరని
నేను వాంఢ్లను గమనించినప్పుడు
నవ్విన పిల్లగానితోని నేనూ నవ్వినప్పుడు
రచయితగా నేను నాట్యమాడిన. ఊపిరి బిగవట్టిన
నా ఆలోచనలతోటి అందరు అట్లనే చేసినరు
గుసగుసలాడినరు
చెరువంత ముచ్చట చెప్పినరు
దాని మీదంగ నేను సునాయాసంగ గంతులేసిన
అక్కడనే రాసేందుకు సంగతులు దొరికినయి.

రాయాలె గనుక రాస్తము
మేము గనుక రాయకుంటే
ఈ బొమ్మలన్ని ఏమవుతయి మరి

Thanks to the unknown poet who gave the idea!!
$%$%$%$

No comments: