Wednesday, May 26, 2010

Confucius and Communication

కన్ఫ్యూషియస్

తన ఊళ్లో ఉంటే
మామూలుగా కనిపిస్తాడు. వినయంగా ఉంటాడు. మాటలు రావేమో అనిపించేట్టు ఉంటాడు.
ఇక రాజకుమారుని పూర్వీకుల మందిరాల్లో నయితే
ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా మాట్లాడతాడు, కానీ ఆచితూచి మాట్లాడతాడు.
సభలో వేచి ఉన్నప్పుడు,తక్కువ స్థాయి అధికారులతోనయితే,
చప్పగా, సూటిగా మాట్లాడతాడు.

ప్రభువు సమక్షంలోనయితే,
అతని ప్రవర్తనలో గౌరవంతో బాటు ఒక అసౌకర్యబావం కనబడుతుంది.

అతిథుల మర్యాదకని యువరాజు పిలిచినప్పుడు,
అతని ముఖంతీరే మారుతుంది. కాళ్లు సులభంగా ముందుకు కదలవు.
తనతోబాటున్న ఇతర అధికారుల మీద ఆధారుడుతున్నట్టు వాలిపోతుంటాడు.
అవసరం కొద్దీ చేతులు కదిలిస్తుంటాడు. దుస్తులను సర్దుతూ ఉంటాడు.
పక్షిలాగ చేతులు ముందుక చాచి పరుగులు పెడతాడు.
అతిథి వెళ్లి పోయిన తర్వాత ఇక మళ్లీ రాడులే అంటాడు

రాజభవనంలోకి ప్రవేశిస్తుంటే,
వంగి నడుస్తాడు. ఆ ద్వారంలో తను పట్టడేమో అన్నట్టు.
నిలబడవలసి వస్తే మధ్యదారిలో మాత్రం ఉండడు.
గడపలను తొక్కకుండా దాటుతుంటాడు.

అంగణంలో నడుస్తుంటే,
అతని తీరు మారుతుంది. కాళ్లు వంగుతాయి.
శ్వాస అందదేమోనన్నట్టు తగ్గి మాటలాడతాడు.

సభలోకి ప్రవేశించేటప్పుడు,
దుస్తుల అంచులు రెండు చేతులా ఎత్తి పట్టుకుని మెట్లెక్కుతాడు.
ముందుకు వంగి, ఊపిరి తీయడం భయమేమోనన్నట్టు, బిగబట్టుకుని ఉంటాడు.

సభలోంచి బయటకు వస్తుంటే,
ఒక్కొక్క మెట్టుకూ సడలింపు కనబడుతుంది.
సంతృప్తి కనబడుతుంది.

చివరి మెట్టు దిగినాక,
చేతులాడిస్తూ ఇంటివేపు వేగంగా వెడతాడు.
అయినా మనిషి ముఖంలో ఏదో అసౌకర్యం కనబడుతుంది.

రాజదండం తన చేతిలో ఉంటే,
బరువు మోయలేకపోతున్నట్టు వంగిపోతుంటాడు.
నమస్కరించేప్పుడు కూడా దండాన్ని మరీ ఎత్తుకు ఎత్తడు.
మరీ కిందకూ దించడు.
అతని తీరులో అనుమానం కనబడుతుంది.
నడక బరువుగా నేలకు కట్టేసినట్టు సాగుతుంది.

బహుమతులు అందుకునేప్పుడు,
ముఖంలో భావాలుండవు.

తనవారి మధ్యలో మాత్రం,
ఎంతో ఆనందంగా కనబడతాడు.

Confucius, in his village, looked simple and sincere, and as if he were not able to speak.


When he was in the prince's ancestral temple, or in the court, he spoke minutely on every point, but cautiously.

When he was waiting at court, in speaking with the great officers of the lower grade, he spoke freely, but in a straightforward manner; in speaking with those of the higher grade, he did so blandly, but precisely.

When the ruler was present, his manner displayed respectful uneasiness; it was grave, but self-possessed.

When the prince called him to employ him in the reception of a visitor, his countenance appeared to change, and his legs to move forward with difficulty.

He inclined himself to the other officers among whom he stood, moving his left or right arm, as their position required, but keeping the skirts of his robe before and behind evenly adjusted.

He hastened forward, with his arms like the wings of a bird.

When the guest had retired, he would report to the prince, "The visitor is not turning round any more."

When he entered the palace gate, he seemed to bend his body, as if it were not sufficient to admit him.

When he was standing, he did not occupy the middle of the gateway; when he passed in or out, he did not tread upon the threshold.

When he was passing the vacant place of the prince, his countenance appeared to change, and his legs to bend under him, and his words came as if he hardly had breath to utter them.

He ascended the reception hall, holding up his robe with both his hands, and his body bent; holding in his breath also, as if he dared not breathe.

When he came out from the audience, as soon as he had descended one step, he began to relax his countenance, and had a satisfied look.

When he had got the bottom of the steps, he advanced rapidly to his place, with his arms like wings, and on occupying it, his manner still showed respectful uneasiness.

When he was carrying the scepter of his ruler, he seemed to bend his body, as if he were not able to bear its weight. He did not hold it higher than the position of the hands in making a bow, or lower than their position in giving anything to another. His countenance seemed to change, and look apprehensive, and he dragged his feet along as if they were held by something to the ground.

In presenting the presents with which he was charged, he wore a placid appearance.

At his private audience, he looked highly pleased.

Do you get the message?
%%%%%%%

No comments: