Friday, February 26, 2010

Kahlil Gibran - Stories

THE WANDERER


I met him at the crossroads, a man with but a cloak and a staff, and a veil of pain upon his face. And we greeted one another, and I said to him, “Come to my house and be my guest.”

And he came.

My wife and my children met us at the threshold, and he smiled at them, and they loved his coming.

Then we all sat together at the board and we were happy with the man for there was a silence and a mystery in him.

And after supper we gathered to the fire and I asked him about his wanderings.

He told us many a tale that night and also the next day, but what I now record was born out of the bitterness of his days though he himself was kindly, and these tales are of the dust and patience of his road.

And when he left us after three days we did not feel that a guest had departed but rather that one of us was still out in the garden and had not yet come in.


వాండరర్

ఒక దుప్పటీ, చేతికర్రా మాత్రమే ఉన్న ఆ మనిషిని నేను నాలుగు దారులు కలిసేచోట కలిసాను. ఒకరికొకరం నమస్కారం చేసుకున్నాము. ‘మా యింటికి రండి. ఆతిథ్యం స్వీకరించండి’ అన్నాను నేను.

అతను వచ్చాడు.

నా భార్యా పిల్లలు ఇంటి ముందే కనిపించారు. అతను వారిని చూచి చిరునవ్వాడు. అతను రావడం వాళ్లందరికీ భాగనిపించింది.

అంతా కలిసి బల్ల ముందు కూచున్నాము. మాకందరికీ సంతోషంగా ఉంది. ఎందుకంటే అతనిలో నిశ్శబ్దం, రహస్యమయతత్వం ఉన్నాయి మరి.

భోజనం తర్వాత అందరమూ నెగడు ముందు చేరాము. నేనతడిని తన ప్రయాణాల గురించి అడిగాను.

అతను ఆ రాత్రీ, మరురోజూ మాకెన్నో కథలు చెప్పాడు. అతని బతుకులోని చేదుతనం వల్ల నాకిప్పుడీ భావం కలిగింది. అతను మాత్రం దయగల మనిషే. ఆ కథలన్నీ అతని దారిలోని దుమ్మూ, ఓపికలేనని నాకనిపిస్తుంది.

మూడురోజుల తర్వాత అతను వెళ్లిపోయాడు. బంధువెవరో వెళ్లిపోయినట్టు అనిపించలేదు మాకు. మాలోని ఒక మనిషి బయట తోటలో ఉన్నాడు, ఇంకా లోనికి రాలేదు అన్నట్లుంది.

________________________________________

GARMENTS

Upon a day Beauty and Ugliness met on the shore of a sea. And they said to one another, “Let us bathe in the sea.”

Then they disrobed and swam in the waters. And after a while Ugliness came back to shore and garmented himself with the garments of Beauty and walked away.

And Beauty too came out of the sea, and found not her raiment, and she was too shy to be naked, therefore she dressed herself with the raiment of Ugliness. And Beauty walked her way.

And to this very day men and women mistake the one for the other.

Yet some there are who have beheld the face of Beauty, and they know her notwithstanding her garments. And some there be who know the face of Ugliness, and the cloth conceals him not from their eyes.

దుస్తులు

ఒకరోజున అందం, అనాకారితనం సముద్రపు ఒడ్డున కలిశాయి. సముద్రంలో స్నానం చేద్దాం అని అనుకున్నాయి.

అప్పుడిక గుడ్డలు వదిలి నీటిలో ఈదులాడాయి. కొంతసేపు తర్వాత అనాకారితనం ఒడ్డుకు వచ్చేసింది. అందం దుస్తులను తాను వేసుకుని వెళ్లిపోయింది.

అందంకూడా సముద్రంలోనుంచి బయటకు వచ్చింది. ఆమె దుస్తులు కనిపించలేదు. గుడ్డలులేకుండా ఉండడానికి సిగ్గుపడింది. అందుకే, అనాకారి బట్టలను తాను వేసుకున్నది. అలా, ఇక అందం తనదారిన పోయింది.

అందుకే ఇవాళటికీ, ఆడా మగా అందరూ, వాళ్లిద్దరినీ సరిగా గుర్తించలేక పోతున్నారు.

అందం ముఖం చూచి, వేసుకున్న గుడ్డలు ఎట్లున్నా ఆమెను గుర్తించే వారు కొందరున్నారు. కొందరికి అనాకారి ముఖం తెలుసు. ఆ అందమయిన దుస్తులు వాళ్ల కళ్లను మోసగించజాలవు.

For many such stories, visit my home pages at http://vijagopalk.tripod.com/
 
You also have the translated version of "Sand and Foam" of of Kahlil Gibran there.
 
Let us enjoy the works that make us think!
!!!!!!!

No comments: