Monday, December 21, 2009

Batuku Tadu -- Novel

After the Kapu Rajaiah Garu's painting in yesterdays posting I was pleasantly reminded of this novel, Sri B S Ramulu gave me some time back.

The writer Sri Nerella Srinivasa Goud is a practicing toddy tapper.
He took up to writing because he has the necessary urge in him.
It is neither the language nor the erudition that makes a writer.
It is the urge inside to tell the world about what you feel and it's force that matters.
Entire folk literature has proved this matter alreday.
Though not exactly in folk or folkish style, this writer once gain has proved the paradigm once again.
I thank Sri B S Ramulu for introducing this writer's work to me.
More such works in dialect should come to keep the language alive.


శ్రీశ్రీ గారు కాదేదీ కవితకనర్హం అన్నట్టు, కారెవరూ రాసెటందుకు అనర్హులు అని రుజువు చేసినరు ఈ రచయిత.


పుస్తకం పేరు బతుకుతాడు అని అచ్చేసినరు.
బతుకుతడు అన్నా బతుకుతాడు అన్నా కొంత మందికి ఒకటే అర్థం.
మనకట్లగాదు.
అయినా పుస్తకం పేరు బతుకు తాడు అని ఇరగ్గొట్టింటె బాగుండునేమో అనిపించింది.
ఈడ బతుకు తాడు అంటె గవుండ్ల మోకు.
దానితోనే తాటిచెట్టు ఎక్కుతరు.
అదే ఈ నవలకు ప్రాణము.

నేను ఈ పుస్తకాన్ని శాన శ్రద్ధతోని చదివిన.
రాసినాయినకు శాన ఓపికె ఉన్నది.
చదువుకోవాలంటని శాన కోరికె ఉన్నది.
అట్లాంటని ఆ చదువేదో అయ్యిన దానుక ఆయిన ఎదురు చూడలేదు.
కథ చెప్పేటందుకు చదువు అవుసరం లేదంటని అందరికి తెలిసేటట్టుగ రాసిండు.
ఆ బతుకులు, అందుట్ల కష్టాలు, పల్లె మనుషుల తీరు, చదువుతుంటే రాత బాగున్నది కాని మనుసు కలకలమన్నది.
గవుండ్లంటె శాన బలిసినోండ్లున్న కులమంటని నేను అనుకున్న.
కానీ నాకు అసలు సంగతి అర్థమయింది.
ఆయన కత చెప్పిది గూడ ఇందుకేనేమో అనిపించింది.


శ్రీనివాసులు రాసిన కథలు గూడ కనిపించినయి.
అంటే ఆయిన మానకుండ రాస్తున్నడన్నమాట.
మంచి సంగతి.
ఇట్లంటోండ్లు ఇంకా రాయాలె.
అప్పుడన్న అందరికి నిజము తెలుస్తది.
పుస్తకము ఎయ్యంగనే గాదు.
అది అందరికి తెలువాలె.
ఎట్ల అని నాకనిపించింది.
నా చాతనయిన పని నేను చేస్తున్న.
పది మంది చూచినా నా పనికి ఫలితం దొరికినట్టే.

Sri Ramulu wrote a forceful introduction to the book.
He has all the reason to say what he said.
I have my reason to think that he is too very passionate about the work.
However, his introduction is worth reading.


Let us enjoy good reading!
#######

No comments: