Monday, October 5, 2009

Page from the diary

కుండలో అన్నము వండుదురు. సరియగు నీరు పెట్టి వండినచో దానిని అత్తెసరు అందురు. అత్తగారికి నైపుణ్యముండును. ఓపిక లేదు. చివరకు నాణ్యతయందును గౌరవము లేదని అర్థము. ఇక కుండలో ముందు కొన్ని నీళ్లు మరిగించి అందు కడిగిన బియ్యమును చేర్చి, ఉడికిన పిదప వార్పుపెట్టుటు మరియొక పద్ధతి. ముందు నీళ్లు మరిగించుటను ఎసరు అందురు. ఏకముగా వానికే ఎసరు పెట్టితివే అని యధిక్షేపించుట గలదు. అనగా ఊరకే వరికో మరగ మంటబెట్టిరని అర్థము. వార్చుటలో, ఉడికిన అన్నములోని పదార్థము కొంత గంజిగా బయటకు పోవును. గంజిలో చల్ల చేర్చి, చింతకాయతొక్కు నంచుకొని తాగుట గుర్తున్నది.

బియ్యము, కుండ తెలిసినవే. గంజి వార్చుటగూడ తెలిసినదే. తట్టుగుడ్డ చర్వము మూతికిగట్టి వార్చుట ఇప్పటికిని జరుగుచున్నది. వెనుక, పల్లెవారి యిండ్లలో, తీగతో (చెట్టుతీగె) అల్లిన మూకుడుండెడిది. వార్చుటకది ఉపకరణము. దాని పేరు సిబ్బి. సత్తుమూకుడులు వచ్చినపుడు, వాటిని సిబ్బిరేకులు నుట వినియుంటిమి. తపుకు, తబుకు అని మరియొక మూకుడుండును. అది పళ్లెము వంటిది. కొంచెము లోతుండును. రొట్టెలు, జొన్నవి చేయుటకు కర్రలో మలిచిన పళ్లెరము, లేక స్తాంబాళముండెడిది. దాని పేరు దాగెర.

కుందెన, కుదురుల గురించి వేరుగా చెప్పితిని.

తెడ్డు, అత్రీసాల పలకలు ఇప్పటికిని మిగిలియున్నవి. వానికి పేర్లు మారినవి. అతిరసములకు తెలగాణ బ్రాహ్మణ్యము పెట్టిన పేరు అత్రీసాలు. ఏరుదాటిననవి అరిసెలు. అరిసి యనగా తమిళమున బియ్యము. బియ్యపు పిండితో చేసిన మధురము అరిసెయా లేక అతిరసము అరిసె యయినదా. తెలుగు విశ్వవిద్యాలయమువారు పరిశోధించవలె. వారు ఇందుగురించిన పుస్తకమును ఇంగిలీసులో వేయుదురేమో.

This entry is more about the language Telugu. I have mused about ways of cooking rice. Now almost everyone uses a pressure cooker for cooking rice. Earlier days, rice was cooked in large quantity of water and the excess water was drained off. If one is good and experienced at cooking, just enough water can be added and rice will be ready without draining. Many people do that. That is called a mother-in-law’s way of cooking. Such a lady would be an expert and lacks the patience. If someone passes an exam with just enough marks, there is a practice in Telugu which goes like he has passed with mother-in-law’s cooking kind of marks.

The entry in my diary on this particular day was more on the language.

There will not be any use in trying to put an English version of it.

My apologies are to visitors who do not know Telugu.

No comments: